APPSC 21 JOBS NOTIFICATION : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 21 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లైబ్రేరియన్ సైన్స్ లో జూనియర్ లెక్చరర్ – 2, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ – 1, డ్రాఫ్ట్స్మన్ గ్రేడ్-2 (టెక్నికల్ అసిస్టెంట్) – 13, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) – 3, హార్టికల్చర్ ఆఫీసర్ – 2 పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలను ఉద్యానవన శాఖ, గ్రామీణ నీటి పారుదల శాఖ, అటవీ శాఖ, బీసీ వెల్ఫేర్ శాఖ, ఇంటర్మీడియట్ విద్య వంటి శాఖల్లో భర్తీ చేయనున్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7, 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, వేతనం తదితర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
వెబ్సైట్ : https://portal-psc.ap.gov.in/HomePages/RecruitmentNotifications
