మన పత్రిక, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో (Telangana State) గత రెండు రోజులుగా అనేక వాట్సప్ గ్రూపుల్లో అనుమానాస్పద .apk ఫైళ్లు వేగంగా షేర్ అవుతున్నాయి. తాజా సమాచారంలో, ఈ ఫైళ్లను “eKYC”, “ఆధార్ అప్డేట్”, “SBI ఖాతా నిర్ధారణ” పేర్లతో పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం, ఇవి క్లిక్ చేసిన వెంటనే మొబైల్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది గ్రూపుల్లో ఈ లింకులు పంచబడుతున్నాయి. డార్క్ నెట్లో సృష్టించిన తాత్కాలిక ఫైళ్లను సైబర్ నేరగాళ్లు “బేబీకి ఫైళ్లు” పేరుతో పంపుతున్నారని అధికారులు చెబుతున్నారు. మొబైల్‌లోకి ఎంటర్ అయిన వెంటనే వ్యక్తిగత డేటా, బ్యాంకింగ్ వివరాలు, UPI సమాచారాన్ని పూర్తిగా దోచుకునే అవకాశముంది.
ఏపీకే ఫైల్ కనిపించిన వెంటనే డేటాను ఆఫ్ చేసి, వెంటనే ఆ ఫైల్‌ను అన్ఇన్స్టాల్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫైల్ మేనేజర్లో “.apk” కోసం సెర్చ్ చేసి మరే ఇతర ఫైళ్లు ఉన్నా తొలగించడం అవసరం. ఆంటీవైరస్తో ఫుల్ స్కాన్ చేసి, బ్యాంకింగ్–UPI–మెయిల్ యాప్‌ల పాస్‌వర్డ్‌లను మార్చడం కూడా మంచిదే. ఫోన్ ఇప్పటికే హ్యాక్ అయిందని అనుమానం ఉంటే 1930 నెంబర్‌కు కాల్ చేసి వివరాలు ఇవ్వాలి.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
