ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అటవీ శాఖలో Draughtsman Grade-II (టెక్నికల్ అసిస్టెంట్) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ భర్తీ ద్వారా మొత్తం 13 ఖాళీలు (12+1 CF) A.P. Forest Subordinate Service కింద భర్తీ చేయబడతాయి. ఒక పోస్టు Meritorious Sportsperson (MSP) కోసం రిజర్వ్ చేయబడింది.
ఈ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు ITI లో Draughtsman (Civil) ట్రేడ్ లేదా B.Tech (Civil) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. భారత పౌరుడై ఉండి, శారీరకంగా ఆరోగ్యవంతులై ఉండాలి. వయస్సు 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి (01.07.2025 నాటికి). SC/ST/BC/EWS, PwBD, Ex-Servicemen వర్గాలకు వయస్సు సడలింపులు వర్తిస్తాయి.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.45,000/- జీతం చెల్లిస్తారు. ప్రభుత్వ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అప్లికేషన్ ఫీజు ₹250 + పరీక్ష రుసుము ₹80. SC/ST/BC, Ex-Servicemen, White Card హోల్డర్లకు పరీక్ష రుసుము మినహాయింపు.
అభ్యర్థులు OTPR రిజిస్ట్రేషన్ చేసి, నోటిఫికేషన్ నంబర్ 16/2025 కోసం ఆన్‌లైన్ లో దరఖాస్తు చేయాలి. అవసరమైన పత్రాలు: ఆధార్, విద్యార్హత సర్టిఫికెట్లు, ITI సర్టిఫికెట్, కులం, స్థానిక సర్టిఫికెట్, ఫోటో, సంతకం.
ఖాళీలు Visakhapatnam, Rajahmundry, Guntur, Ananthapuramu, Kurnool జోన్లలో ఉన్నాయి. నోటిఫికేషన్ 16 సెప్టెంబర్ 2025న విడుదలైంది. అప్లికేషన్లు 18 సెప్టెంబర్ నుండి ప్రారంభమయ్యాయి. చివరి తేదీ 08 అక్టోబర్ 2025, రాత్రి 11:00 గంటల వరకు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

