మన పత్రిక వెబ్డెస్క్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. రంజాన్ పండుగ దృష్ట్యా మార్చి 20న జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ అనుమతితో ఈ పరీక్షను మార్చి 21వ తేదీన నిర్వహించనున్నారు.
సవరించిన షెడ్యూల్ ప్రకారం.. మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లీష్, 23న గణితం, 25న ఫిజిక్స్, 28న బయాలజీ, 30న సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష సమయం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు యథాతథంగా ఉంటుంది.
Advertisement
ఇంగ్లీష్ మినహా మిగతా పరీక్షలన్నీ పాత తేదీల్లోనే జరుగుతాయని, విద్యార్థులు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
Advertisement
