Advertisement

రేపు స్కూళ్లకు సెలవు రద్దు.. రెండో శనివారం వర్కింగ్ డే!

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు (రెండో శనివారం) పాఠశాలలకు సెలవు లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల ‘మొంథా’ తుఫాన్ కారణంగా పలు జిల్లాల్లో వరుసగా వర్షం సెలవులు ఇచ్చిన నేపథ్యంలో, ఆ సెలవులను భర్తీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

రెయిన్ హాలిడేస్‌కు బదులుగా రెండో శనివారాల్లో పాఠశాలలు నడపాలని పలు జిల్లాల డీఈఓలు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రేపు ఏలూరు, బాపట్ల, విశాఖ జిల్లాల్లో స్కూళ్లు యథావిధిగా పనిచేయనున్నాయి. అంతేకాకుండా, డిసెంబర్ మరియు ఫిబ్రవరి నెలల్లో వచ్చే రెండో శనివారాల్లో కూడా పాఠశాలలు పనిచేస్తాయని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement