Advertisement

AP Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన

మన పత్రిక, వెబ్​డెస్క్

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల ముందుగా నిర్వహించనున్నారు. సర్పంచ్ పదవీకాలం 2026 ఏప్రిల్ తో ముగియనుండడంతో, ఎన్నికల ప్రక్రియను ముందస్తుగా ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయించారు. అక్టోబర్ 15లోగా వార్డుల విభజన పూర్తి చేయాలి. నవంబర్ 30లోపు పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయాలి. డిసెంబర్ 15లోపు రిజర్వేషన్ల కేటాయింపు పూర్తి చేయాలి.

Advertisement

2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, అదే నెలలో ఫలితాలు ప్రకటించాలని ప్రీ-ఎలక్షన్ షెడ్యూల్ సూచిస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖలు రాశారు. సమయపాలనతో ఎన్నికల ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.

Advertisement