Advertisement

Speaker Ayyanna | ఆ పెన్షన్లు తీసేయమని నేనే చెప్పా

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ ( AP PENSION ) వ్యవస్థలో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. అనర్హులుగా గుర్తించబడిన లక్ష మందికి పైగా వికలాంగుల పింఛన్లు రద్దు చేశారు. ఈ చర్య ప్రభుత్వానికి ఆర్థిక ఉపశమనం కలిగిస్తోంది.

Advertisement

స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇటీవల ఓ సంచలన వ్యాఖ్య చేశారు. అనర్హుల పెన్షన్లు తొలగించాలని తాను సీఎం చంద్రబాబుకు ( CHANDRA BABU NAIDU ) రాసిన లేఖలో సూచించానని వెల్లడించారు. నిబంధనల ప్రకారం 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికే పింఛన్లు ఇవ్వాలని స్పష్టం చేశారు.

Advertisement

అనకాపల్లి ( ANKAPALLI ) జిల్లాలో 4,148 మంది వికలాంగుల్లో 3,349 మంది పింఛన్లు రద్దు చేశారు. 120 మందికి ఆరోగ్య పింఛన్లు, 679 మందికి వృద్ధాప్య పింఛన్లు మార్చారు. నర్సీపట్నంలో 742 మందిలో 670 మంది పింఛన్లు రద్దయ్యాయి.

ప్రభుత్వం నెలకు రూ. 2.94 కోట్లు, ఏటా రూ. 35.28 కోట్లు ఆదా చేస్తోంది. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంది. అర్హత ఉన్నా తప్పుగా రద్దు చేసిన వారు ఈ నెల 25వ తేదీలోపు వైద్య ధృవపత్రాలు సమర్పించవచ్చు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement