Advertisement

AP Koushalam Survey 2025 | ఎలా చేయాలి, అర్హతలు, రిపోర్ట్ లింక్

AP Koushalam Survey 2025 Link – ముఖ్య వివరాలు

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ‘కౌశలం సర్వే 2025’ చేపట్టింది. ఇది గతంలోని ‘వర్క్ ఫ్రం హోమ్ సర్వే’ కి నవీకరించిన వెర్షన్.

Advertisement

అర్హత: ముందస్తుగా వర్క్ ఫ్రం హోమ్ సర్వేలో నమోదు చేసుకున్న వారు మాత్రమే. ఇప్పుడు 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ చదివిన వారందరూ సర్వేలో పాల్గొనొచ్చు.

సర్వే ప్రక్రియ: కొత్త GSWSS ఉద్యోగుల యాప్ ద్వారా జరుగుతుంది. బయోమెట్రిక్ లేదా OTP ద్వారా ధృవీకరణ తర్వాత విద్యార్హతలు, స్పెషలైజేషన్, పాస్ చేసిన సంవత్సరం, సర్టిఫికెట్ ఫోటోలు అప్‌లోడ్ చేయాలి.

సర్వే రిపోర్ట్: గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు పూర్తి చేసిన వారి సంఖ్యను అధికారిక లింక్ ద్వారా చూడొచ్చు.

సూచన: సచివాలయ సిబ్బంది ముందుగా పెండింగ్ లిస్ట్, సర్టిఫికెట్లు సేకరించి, సెర్చ్ ఫీచర్ ఉపయోగించి సర్వేను వేగవంతం చేయొచ్చు.

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/KoushalamReport

Advertisement