Advertisement

AP ICET Hall Ticket 2026: ఏపీ ఐసెట్ 2026 హాల్ టికెట్లు విడుదల..

మన పత్రిక, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్-2026 హాల్ టికెట్లు అధికారికంగా విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in ద్వారా తమ అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాల్లో మే 2వ తేదీన ఈ ప్రవేశ పరీక్ష జరగనుంది. మొత్తం 200 మార్కులకు, రెండున్నర గంటల వ్యవధిలో ఆన్‌లైన్ విధానంలో ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్‌తో పాటు ఆధార్, పాన్ లేదా ఓటర్ ఐడీ వంటి ఏదైనా ఒక ఒరిజినల్ ప్రభుత్వ గుర్తింపు కార్డును అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకురావాలి.

Advertisement

ఏపీ ఐసెట్ 2026 – ముఖ్యమైన తేదీలు

ఈవెంట్తేదీ & సమయం
ప్రవేశ పరీక్ష (ఎగ్జామ్)మే 2, 2026 (ఉదయం 9:00 – 11:30 & మధ్యాహ్నం 2:00 – 4:30)
ప్రాథమిక కీ (Primary Key) విడుదలమే 5, సాయంత్రం 5 గంటలకు
కీ పై అభ్యంతరాల స్వీకరణమే 7 వరకు
తుది ఫలితాల ప్రకటనమే 16, 2026

ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి ఏపీ ఐసెట్ – 2026 హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Advertisement