Advertisement

AP Family Card | ఏపీలో ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( chandrababu naidu ) రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు ( AP FAMILY CARD 2025 ) జారీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందరికీ చేరువ చేయడమే ఈ నిర్ణయం లక్ష్యం.

Advertisement

ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలతో పాటు, వారు పొందుతున్న ప్రభుత్వ పథకాల సమాచారం కూడా ఉండనుంది. ఫ్యామిలీ కార్డు డిజైన్ కోసం ఆధార్ ఆధారంగా ఉపయోగించాలని చంద్రబాబు సూచించారు. పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదని, అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా పథకాలను రీ-డిజైన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షణ సులభతరం కానుంది. అర్హులైన వారికి మాత్రమే ప్రయోజనాలు చేరుతాయని నిర్ధారించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement