AP EAMCET BiPC Pharmacy Seat Allotment Result 2025: ఏపీ ఎంసెట్ (బైపీసీ) ఫార్మసీ విభాగం సీట్ల కేటాయింపు ఫలితాలు ఈరోజు (అక్టోబర్ 24) సాయంత్రం 6 గంటల తర్వాత విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి (APSCHE) ధృవీకరించింది. వాస్తవానికి అక్టోబర్ 21నే విడుదల కావాల్సిన ఈ ఫలితాలు మూడు రోజులు వాయిదా పడ్డాయి.
ఫలితాల లింక్ యాక్టివేట్ అయిన తర్వాత, విద్యార్థులు తమ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ మరియు మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి తమ సీటు కేటాయింపు వివరాలను తెలుసుకోవచ్చు. సీటు పొందిన వారు ట్యూషన్ ఫీజు చెల్లించి, ‘సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్’ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
కాలేజీలలో ఫిజికల్ రిపోర్టింగ్ కోసం సవరించిన తేదీలను మండలి ఇంకా ప్రకటించలేదు. ఫేజ్ 1 కేటాయింపుతో సంతృప్తి చెందని విద్యార్థులు, నవంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్న ఫేజ్ 2 కౌన్సెలింగ్ కోసం వేచి చూడవచ్చు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

