ఏపీలో డిస్ట్రిక్ట్ స్కూల్స్ సర్వీసెస్ కమిషన్ (AP DSC) 2025 మెరిట్ లిస్ట్ విడుదలకు సంబంధించి కీలక సమాచారం బయటకు వచ్చింది. ఈ ఏడాది మెరిట్ ర్యాంక్ లేకుండా, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు అర్హులైన అభ్యర్థుల జాబితాను మాత్రమే ప్రభుత్వం విడుదల చేయనుంది.
ఈ జాబితా ఆగస్టు 22 విడుదల కానుంది. స్కూల్ అసిస్టెంట్స్ ( AP SCHOOL ASSISTANT ) , సెకన్డరీ గ్రేడ్ టీచర్స్ (AP SGT), లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ apdsc.apcfss.in లో జిల్లాల వారీగా పీడీఎఫ్ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మెరిట్ లిస్ట్ లో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, కేటగిరి, సాధించిన మార్కులు ఉంటాయి. కానీ ర్యాంక్ ఉండదు. ఈ జాబితాలో పేరు ఉన్నవారు తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలి.
రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఖాళీల భర్తీకి ఈ నియామకం జరుగుతోంది. ప్రతి జిల్లాకు ప్రత్యేక పీడీఎఫ్ ఉంటుంది. ప్రస్తుతానికి అన్ని జిల్లాల లిస్ట్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Ap dsc merit list district wise
CLICK HERE TO DOWNLOAD ( RESULT RELEASED)
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

