మన పత్రిక, వెబ్‌డెస్క్: మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. చిత్తూరు ఫోక్సో కోర్టు గురువారం ఈ సంచలన తీర్పు వెలువరించింది.
పిటిఎం మండలం మద్దయ్య గారిపల్లికి చెందిన పూలా నరేంద్ర రెడ్డి (31), అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను పెళ్లి పేరుతో మోసం చేశాడు. 2023 నవంబర్ 29 లోపు బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విచారణ జరిపిన చిత్తూరు ఫోక్సో కోర్టు స్పెషల్ జడ్జి ఎం.శంకర్రావు, నిందితుడిపై నేరం రుజువు కావడంతో 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ. 1 లక్ష నష్టపరిహారం చెల్లించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

