మన పత్రిక: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనల సందర్భంగా జరిగిన హింస, విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ ఘటనలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సుదీర్ఘ లేఖ రాశారు. విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను కేవలం శాంతిభద్రతల కోణంలో చూడకుండా, సామాజిక సమస్యగా పరిగణించి ప్రభుత్వం వారితో తక్షణమే చర్చలు జరపాలని ఆయన సూచించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జరిగిన ‘చలో సంసద్’ ర్యాలీలో పేపర్ లీక్‌లు, పరీక్షల్లో అవకతవకలు, విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్లతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ప్రజాస్వామ్యంలో హింసకు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి లేదా పోలీసుల అనవసర బలప్రయోగానికి తావులేదని అన్నా హజారే స్పష్టం చేశారు. నీట్ పరీక్ష వివాదాన్ని ప్రస్తావిస్తూ, వ్యవస్థలో లోపాలు వచ్చినప్పుడు కింది స్థాయి అధికారులను బలిపశువులను చేయడం సరికాదని, ఆయా శాఖల మంత్రులు పూర్తి రాజకీయ జవాబుదారీతనం వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. బాధ్యులైన మంత్రులను తప్పించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ తగ్గదని, అది సమర్థవంతమైన పాలనకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అలాగే లడఖ్‌కు చెందిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష పట్ల ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలని హజారే కోరారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
