మన పత్రిక, వెబ్‌డెస్క్ : తెలంగాణ హైకోర్టు ( Telangana Highcourt ) అంగన్వాడీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించాలని సంచలన తీర్పు ఇచ్చింది. ఇప్పటికే సంవత్సరాల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులను పక్కన పెట్టి కొత్త నియామకాలు చేపట్టడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది.
Latest judgement of contract employee regularization
2013లో మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన మీరాభాయ్ సహా దాదాపు 200 మంది అంగన్వాడీ కార్యకర్తలు రెండు పిటిషన్లు దాఖలు చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారి సేవలను క్రమబద్ధీకరించాలని, కొత్త నోటిఫికేషన్లలో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్లపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ నిర్వహించి తీర్పు ఇచ్చారు.
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులకు కేవలం 15 శాతం వెయిటేజీ ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది. దశాబ్దాలుగా, కొంతమంది 25 ఏళ్లుగా సేవలందిస్తున్నా వారిని పక్కన పెట్టడం న్యాయం కాదని పేర్కొంది. ఉద్యోగులు అనర్హులు కాదని అధికారులు గతంలోనే గుర్తించారు. అందుకే వారికి కొత్త పరీక్షలు రాయాలని బలవంతపెట్టడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఇచ్చిన జాగ్గొ వర్సెస్ కేంద్రం, కర్ణాటక వర్సెస్ ఉమాదేవి తీర్పులను ప్రస్తావిస్తూ, కాంట్రాక్ట్ ఉద్యోగులను తప్పనిసరిగా క్రమబద్ధీకరించాలని హైకోర్టు ఆదేశించింది. క్రమబద్ధీకరణ తర్వాత పదవీ విరమణ ప్రయోజనాలిచ్చేటప్పుడు వారి పూర్తి సర్వీస్ పీరియడ్ పరిగణనలోకి తీసుకోవాలని కూడా ఆదేశించింది.
ఇవి కూడా చదవండి :
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
