మన పత్రిక, వెబ్‌డెస్క్: అండమాన్ ఎక్స్‌ప్రెస్ ( andaman express ) రైలులో ఓ కొండచిలువ కలకలం సృష్టించింది. రైలులోని ఎస్2 కోచ్ వాష్‌రూమ్‌లో కొండచిలువను గమనించిన ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురై, వెంటనే టీటీఈకి సమాచారం అందించారు.
Advertisement
అప్పటికే రైలు డోర్నకల్ దాటి విజయవాడ వైపు వెళ్తోంది. టీటీఈ అప్రమత్తమై ఖమ్మం స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. రైలు ఖమ్మం చేరుకోగానే, ఆర్పీఎఫ్ బృందం మరియు స్నేక్ క్యాచర్ మస్తాన్ సంయుక్తంగా ఆ కొండచిలువను సురక్షితంగా బంధించారు. తక్షణమే స్పందించి ప్రమాదాన్ని నివారించిన అధికారులకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

