Advertisement

AP Bus Accident: 10 మంది మృతి, 20 మందికి గాయాలు.

మన పత్రిక, వెబ్​డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో పర్యాటకుల బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అన్నవరం నుంచి అరకు మీదుగా భద్రాచలం వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

చిత్తూరుకు చెందిన ఏవీఎం ట్రాన్స్‌పోర్టు బస్సు (AVM Transport)ను 7 రోజుల టూర్ కోసం పర్యాటకులు బుక్ చేసుకున్నట్లు తెలిసింది. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సబ్ కలెక్టర్ పర్యవేక్షణలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Advertisement
Advertisement