Allu Arjun Ghaati: అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఘాటీ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్రతి కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియో సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అనుష్క చేసిన యాక్షన్ సీక్వెన్స్ స్టార్ హీరోల సినిమాలకు సైతం గట్టి పోటీ ఇస్తోంది.
అనుష్క ప్రమోషన్స్ లో కూడా సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. సాధారణ ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ కాకుండా ఫోన్ కాల్స్ ద్వారా మీడియాతో సంభాషిస్తోంది. ఇటీవల ఎఫ్ఎమ్ రేడియోలో కూడా ఘాటీ గురించి మాట్లాడింది. దగ్గుబాటి రానాతో జరిపిన ఫోన్ కాల్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇప్పుడు మరో సర్ప్రైజ్ ఇచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అనుష్కతో ఆరు నిమిషాల పాటు ఫోన్ కాల్ లో మాట్లాడాడు. వేదం, రుద్రమదేవి సినిమాల పాత జ్ఞాపకాలు పంచుకున్నారు. ఘాటీ గురించి ఉత్సాహంగా చర్చించారు. వారి సంభాషణ ఫన్ గా, ఎమోషనల్ గా సాగింది.
ఇంతకు ముందు ప్రభాస్ కూడా ఈ సినిమా గ్లింప్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రమోట్ చేశాడు. అల్లు అర్జున్ కాల్ ఆడియో విన్న ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఘాటీ సినిమాపై ఇంకా ఆసక్తిని పెంచేసింది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

