Advertisement

హైదరాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబై బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో పైలట్ అప్రమత్తమై విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి తిప్పి పంపి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో ఉన్న 109 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.

సాంకేతిక పరిశీలనలో విమానం

హైదరాబాద్ నుంచి ఏఐ 417 విమానం బయలుదేరిన ఐదు నిమిషాలకే ఈ సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించడంతో, విమానాన్ని తిరిగి విమానాశ్రయానికి తీసుకెళ్లాలని సూచించారు. ల్యాండింగ్ తర్వాత సాంకేతిక నిపుణులు విమానాన్ని పరిశీలిస్తున్నారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లపై సమాచారం రావాల్సి ఉంది.

Advertisement
Advertisement