Advertisement

ఆగ్రాలో దారుణం: భార్య మాట విని కన్నతల్లికి విషం పెట్టిన కొడుకు

మన పత్రిక, ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో కన్నతల్లికి విషం పెట్టిన ఘటన కలకలం రేపింది. పినహట్ పరిధిలోని బార్‌పురా గ్రామానికి చెందిన రవీంద్ర అనే యువకుడు తన భార్యను తిరిగి కాపురానికి రప్పించుకోవాలనే ఉద్దేశంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన భార్య పుట్టింటికి వెళ్లడంతో, అత్త ఫూల్‌వతి ఇచ్చిన సలహా మేరకు అతను తన తల్లి రామ్మూర్తికి విషం కలిపిన ఆహారాన్ని తినిపించాడు. జులై 9న చోలే కూరలో విషం కలిపి తల్లికి అందించడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

బాధితురాలి భర్త రణ్‌వీర్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న అత్త ఫూల్‌వతి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

Advertisement
Advertisement