IT రంగంలో కెరీర్ ప్రారంభించాలని భావిస్తున్న ఫ్రెషర్స్‌కు మంచి అవకాశం వచ్చింది. ప్రముఖ IT సంస్థ Agilitz Technologies టెక్నికల్ ఇంటర్న్ పోస్టుల కోసం నియామకాలు చేపట్టింది.
ఈ ఉద్యోగాలు Bangalore మరియు Bhubaneswar నగరాల్లో ఉంటాయి. 2025 బ్యాచ్‌కు చెందిన BTech, MCA, లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశానికి అర్హులు.
ఎంపికైన అభ్యర్థులకు మొదట Technical Intern గా అవకాశం ఇస్తారు. ఇంటర్న్‌షిప్ సమయంలో నెలకు ₹15,000 నుంచి ₹20,000 వరకు స్టైపెండ్ అందిస్తారు. పనితీరు ఆధారంగా తర్వాత ₹4 నుంచి ₹4.5 లక్షల వార్షిక జీతంతో ఫుల్‌టైమ్ ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది. జాయినింగ్ తేదీ 2026 ఏప్రిల్ 15గా నిర్ణయించారు.
అభ్యర్థులకు కనీసం 6.5 CGPA, ఇంటర్వ్యూ సమయంలో ఎలాంటి బ్యాక్‌లాగ్స్ లేకపోవాలి. అలాగే Java, Python, JavaScript, .NET, C లేదా C++ వంటి ప్రోగ్రామింగ్ భాషల్లో ప్రాథమిక కోడింగ్ పరిజ్ఞానం ఉండాలి. SQL లేదా డేటాబేస్ కాన్సెప్ట్స్‌పై ప్రాథమిక అవగాహన కూడా అవసరం.
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, టీమ్‌తో పని చేసే నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు ఈ అవకాశం మంచి ప్రారంభంగా భావిస్తున్నారు.
అప్లై చేసుకోవడానికి కింది లింక్ ని ఉపయోగించండి.
Apply Link: https://tinyurl.com/48an723z
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
