Advertisement

అడవి శేష్ ‘డెకాయిట్’ ట్రైలర్ రిలీజ్

మన పత్రిక, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ డెకాయిట్ విడుదలకు సిద్ధమైంది. చాలా రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ సినిమా పై ఉన్న అంచనాలను మరింత పెంచింది.

ట్రైలర్ ప్రారంభంలో శేష్, మృణాల్ మధ్య అందమైన ప్రేమకథను చూపిస్తూ పెళ్లి, కుటుంబం వంటి కలలతో వారి జీవితం సాఫీగా సాగుతున్నట్లు చూపించారు. అయితే కథ ఒక్కసారిగా మలుపు తిరిగి ద్రోహం నేపథ్యంలో శేష్ జైలు పాలవుతాడు. అక్కడి నుంచి ఒక సాధారణ ప్రేమికుడు ఎలా పవర్‌ఫుల్ ‘డెకాయిట్’గా మారాడన్నదే సినిమా ప్రధాన కథాంశంగా కనిపిస్తోంది. శేష్ తన పాత ప్రేయసి జూలియట్ (మృణాల్) కోసం వెతుకుతూ సాగించే ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు, వారిద్దరి మధ్య ఉన్న భావోద్వేగ సంఘర్షణ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. జూలియట్‌కు అత్యవసరంగా డబ్బు అవసరం కావడం, దాన్ని సమకూర్చడానికి శేష్ దోపిడీలకు దిగడం కథలో ఆసక్తికరంగా మలిచారు. ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. జైలు బ్రేక్ సీన్, పోలీస్ ట్రాన్స్‌ఫర్‌పై దాడి, ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్‌లు ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. కార్ చేజింగ్‌లు, గన్ ఫైట్స్ హాలీవుడ్ స్టైల్‌లో ఉండగా, టెక్నికల్ వాల్యూస్ కూడా ఉన్నత స్థాయిలో కనిపిస్తున్నాయి.

Advertisement

Advertisement