మన పత్రిక, వెబ్‌డెస్క్: తెలంగాణలోని ఉత్తర జిల్లాలను చలి వణికిస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 6 నుంచి 7 డిగ్రీలకు పడిపోవడంతో పాటు దట్టమైన పొగమంచు అలుముకుంటోంది. ఉదయం వేళల్లో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి గురువారం పాఠశాలల వేళలను మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ అనే తేడా లేకుండా జిల్లాలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఈ మార్పులు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
Advertisement
కొత్త వేళలు ఇవే:
- పాత సమయం: ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు.
- సవరించిన సమయం: ఉదయం 9:40 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు.
ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
