Advertisement

వైజాగ్‌లో రూ. 8,500 కోట్ల విద్యుత్ ప్రాజెక్టును దక్కించుకున్న అదానీ ఎనర్జీ

మన పత్రిక: విశాఖపట్నంలో రూ. 8,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న భారీ విద్యుత్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టును Adani Energy Solutions సంస్థ దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక, సాంకేతిక అవసరాలకు తగినంత విద్యుత్ సరఫరాను అందించేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకమని సమాచారం. విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ప్రాజెక్టులకు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు దీనిని ప్రత్యేకంగా వినియోగించనున్నారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో డేటా సెంటర్లు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలు మరింత వేగంగా వృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడుతుంది. మొత్తం 1,582 కిలోమీటర్ల పొడవైన ట్రాన్స్‌మిషన్ లైన్లతో పాటు 10,500 ఎంవీఏ సామర్థ్యాన్ని అదనంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. కాంట్రాక్టు నిబంధనల ప్రకారం రాబోయే 30 నెలల్లోగా ఈ ప్రాజెక్ట్ పనులన్నింటినీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement
Advertisement