తెలంగాణ లో ప్రస్తుతం ప్రసిద్ధ గిరిజన క్షేత్రమైన “మేడారం” (Medaram) జాతరకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే భక్తులు సమ్మక్క – సారలమ్మలను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. రోజురోజుకి జనాల రద్దీ కూడా పెరిగిపోతుంది. ఇక ఈ జాతరలో బంగారంగా పిలవబడే బెల్లంతో తులాభారం వనదేవతలకు సమర్పించడం ఆచారం. అయితే రీసెంట్ గా ప్రముఖ తెలుగు హీరోయిన్ టీనా శ్రావ్య (Teena Shravya) తన పెంపుడు కుక్కకు బంగారం తూకం వేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కాగా, భక్తులు మండిపడి నెట్టింట నెగిటివ్ కామెంట్స్, ట్రోలింగ్ చేసారు.
అయితే దీనిపై నటి టీనా శ్రావ్య వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్తూ వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో “తన పెంపుడు కుక్క అనారోగ్యం బారిన పడినప్పుడు దాని నుంచి కోలుకుంటే మేడారంలో బంగారం సమర్పిస్తానని తాను మొక్కుకున్నానని… అందుకే తమ కుక్క బరువు ఉండే బంగారాన్ని తులాభారం వేయించానని చెప్పుకొచ్చింది. కానీ, మేడారం జాతర సంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారం ప్రకారం ఇది తప్పని తెలుసుకున్న శ్రావ్య క్షమాపణలు చెప్పింది.
అయితే మరికొంత మంది భక్తులు, సామాన్య ప్రజలు ఆమె చేసింది తప్పు కాదని, దైవం మీద నమ్మకం ఉండే అలా చేసిందని, అది కుక్క మీద ప్రేమ, అలాగే దేవతల మీద భక్తితోనే చేసిందని, ఎక్కడా అపహాస్యం గాని, తప్పు గాని జరగలేదని శ్రావ్యకు మద్దతిస్తున్నారు. ఇక నెట్టింట కూడా ఈ మధ్య ప్రతిదానికి నెటిజన్లు పలు విధాలుగా నెగిటివ్ గానే ఎక్కువగా స్పందించడం కామన్ అయిపొయింది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
