మన పత్రిక: భారత టీ20 క్రికెట్లో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న Abhishek Sharma అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నారు. పొట్టి ఫార్మాట్లో 6000 పరుగుల మార్కును అందుకోవడానికి ఆయనకు మరో 16 పరుగులు మాత్రమే అవసరమని సమాచారం. జింబాబ్వే సిరీస్ ద్వారా ఈ ఘనత సాధించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ రికార్డును పూర్తే చేస్తే, 200 లేదా అంతకంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో 6000 టి20 పరుగులు సాధించిన నాలుగో భారత ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలుస్తారు. అంతకుముందు భారత్ తరఫున కేఎల్ రాహుల్ 166 ఇన్నింగ్స్‌లలో, విరాట్ కోహ్లీ 184 ఇన్నింగ్స్‌లలో, శుభ్‌మన్ గిల్ 185 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించారు. అంతర్జాతీయంగా క్రిస్ గేల్ 162 ఇన్నింగ్స్‌లలోనే 6000 పరుగులు చేసి అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న బ్యాటర్‌గా రికార్డు సృష్టించారు.
అభిషేక్ శర్మ ఇప్పటివరకు 203 టీ20 మ్యాచ్‌లలో 199 ఇన్నింగ్స్‌లు ఆడి 5984 పరుగులు చేశారు. ఇందులో భారత జాతీయ జట్టు తరఫున 53 మ్యాచ్‌లలో ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన అభిషేక్, రాబోయే జింబాబ్వే సిరీస్ ద్వారా మళ్లీ పరుగుల బాట పట్టి ఫామ్‌లోకి రావాలని భావిస్తున్నారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- హనీమూన్ హత్య కేసులో సోనమ్ రఘువంశీ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
- ముచ్చినిపర్తిలో 6 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
- చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నాయకుడు భూమనా కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు
- ఐటీ ఉద్యోగాలకు సాంకేతిక నైపుణ్యాలే కీలకమని నిపుణుల స్పష్టం
- ఆర్టీసీ బస్సుల మధ్య నలిగి మహిళ దుర్మరణం
