Advertisement

ఆధార్ బయోమెట్రిక్ లాక్: మోసాలకు చెక్!

UIDAI News: మీ ఆధార్ బయోమెట్రిక్ డేటా – వేళ్లముద్ర, కంటి గుడ్డు (ఐరిస్), ముఖ స్కాన్ లను ఎవరైనా అనుమతి లేకుండా ఉపయోగించలేరు. ఈ ఫీచర్ ఆర్థిక లావాదేవీలు, ప్రభుత్వ సేవల్లో జరిగే మోసాలను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. యూఐడీఏఐ సోషల్ మీడియా ద్వారా ఈ ఫీచర్ గురించి ప్రజలకు అవగాహన కలిపిస్తోంది. బయోమెట్రిక్ లాక్ చేయడం చాలా సులభం.

  • ముందుగా myAadhaar పోర్టల్ (https://myaadhaar.uidai.gov.in ) కు లాగిన్ అవ్వండి.
  • మీ ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ మరియు OTP నమోదు చేయాలి.
  • తర్వాత పేజీలో “Lock/Unlock Biometrics” ఆప్షన్ ఎంచుకోండి.
  • బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో జాగ్రత్తగా చదవండి.
  • “Consent” బాక్స్ ని టిక్ చేసి, “Next” క్లిక్ చేయండి.
  • చివరగా మీకు “Your biometrics have been successfully locked” అనే సందేశం వస్తుంది.

లాక్ చేసిన తర్వాత, ఎవరైనా మీ బయోమెట్రిక్ డేటా ఉపయోగించాలంటే మీరు మళ్లీ అన్‌లాక్ చేయాలి.

Advertisement
Advertisement