Advertisement

భర్తను వదిలి పదిసార్లు పారిపోయిన మహిళ

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఓ వివాహిత చేసిన డిమాండ్ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. తన భర్తను వదిలి పది సార్లు ప్రియుడితో పారిపోయిన ఆ మహిళ, చివరికి తన జీవితాన్ని ఇద్దరితోనూ పంచుకుంటానని ప్రకటించింది. ఈ విచిత్రమైన వ్యవహారం పరిష్కరించడానికి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు పంచాయతీని ఏర్పాటు చేశారు. పంచాయతీలో అందరి ముందు ఆమె తన నిర్ణయాన్ని నిర్మొహమాటంగా ప్రకటించి, నెలలో 15 రోజులు తన భర్తతో, మిగిలిన 15 రోజులు తన ప్రియుడితో గడుపుతానని షరతు విధించింది.

ఈ ప్రతిపాదన విన్న ఆమె భర్త, గ్రామ నాయకులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కన్నీళ్లతో ఆమె భర్త “తనను ఒంటరిగా వదిలేయాలని, ఆమె ఎవరితోనైనా ఉండవచ్చు” వేడుకున్నాడు. ఈ విచిత్రమైన షరతు విన్న తర్వాత పంచాయతీ కూడా ఏం చేయాలో తెలియక నిశ్చేష్టంగా ఉండిపోయింది. ఏడాదిన్నర క్రితం పెళ్లైన ఆ మహిళ, పెళ్లయిన కొద్దికాలానికే పొరుగు గ్రామానికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రతిసారీ భర్త ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చినప్పటికీ, ఆమె అతనితో పది సార్లు పారిపోయింది. ఇలాంటి అసాధారణ పరిస్థితులు సమాజంలో నైతిక విలువల క్షీణతకు అద్దం పడుతున్నాయి. భర్త, ప్రియుడి మధ్య సమయాన్ని పంచుకోవాలని ఒక మహిళ బహిరంగంగా డిమాండ్ చేయడం, కుటుంబ సంబంధాలపై దాని ప్రభావం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

Advertisement

Advertisement