మన పత్రిక: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 20 ఎపిసోడ్లో వరుస ప్రాణగండాలతో భయపడిన ప్రభావతి చివరకు స్వామీజీ చెప్పిన పరిహారానికి అంగీకరించింది. మనోజ్ చేసిన పొరపాటు వల్ల ఇంట్లో ప్రభావతి సహా అందరికీ కరెంట్ షాక్ తగలగా, మీనా సమయస్ఫూర్తితో కర్రతో కొట్టి వాళ్లను కాపాడింది.
అంతకుముందు, షాపు దగ్గర ఉన్న గుడ్డు వల్ల మనోజ్‌తో పాటు ఆయన తల్లికి ప్రాణగండం ఉందని స్వామీజీ హెచ్చరించాడు. పరిహారంగా మనోజ్ వేపాకులు చుట్టుకుని, ప్రభావతి పసుపు చీర కట్టుకుని గుడి చుట్టూ తిరగాలని సూచించాడు. మొదట ఈ పరిహారానికి ప్రభావతి ససేమిరా అంది. అయితే ఇంట్లో ఆమెపై ఫ్యాన్ విరిగిపడటం, ఆ తర్వాత కరెంట్ షాక్ తగలడంతో ప్రాణభయంతో పూజకు సరేనంటుంది.
మరోవైపు, మోటర్ మెయిన్ ఆన్ చేసి అందరికీ షాక్ కొట్టడానికి కారణమైన మనోజ్‌ను రోహిణి, ఇతర కుటుంబ సభ్యులు చితకబాదారు. దీంతో నేటి ఎపిసోడ్ ఉత్కంఠగా ముగిసింది.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
