మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం కీలక బదిలీలు చేపట్టింది. అదనపు ఎస్పీ (ఏఎస్పీ) హోదాలో ఉన్న 9 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు ఈ మేరకు అధికారిక ఆదేశాలు వెలువరించారు.
పరిపాలనా సౌలభ్యం, మెరుగైన పోలీసింగ్, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ బదిలీలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. బదిలీ అయిన అధికారులంతా తక్షణమే తమ కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని ఆదేశాల్లో పేర్కొంది.
బదిలీ అయిన ఐపీఎస్ (ఏఎస్పీ) అధికారుల జాబితా
| అధికారి పేరు | పాత పోస్టింగ్ | కొత్త పోస్టింగ్ |
| బొక్కా చైతన్యరెడ్డి | కామారెడ్డి ఏఎస్పీ | సంగారెడ్డి అదనపు ఎస్పీ |
| పందిరి చేతన్ నితిన్ | జనగామ ఏఎస్పీ | జగిత్యాల ఏఎస్పీ |
| విక్రాంత్‌కుమార్ సింగ్ | భద్రాచలం ఏఎస్పీ | మెదక్ ఏఎస్పీ |
| నగ్రాలె శుభమ్ ప్రకాశ్ | వరంగల్ ఏఎస్పీ | నిజామాబాద్ అదనపు డీసీపీ |
| రాజేశ్ మీనా | భైంసా అదనపు ఎస్పీ | వనపర్తి ఏఎస్పీ |
| ఎస్.చిత్తరంజన్ | ఆసిఫాబాద్ ఏఎస్పీ | ఆసిఫాబాద్ అదనపు ఎస్పీ (అడ్మిన్) |
| పి.మౌనిక | ఆదిలాబాద్ ఏఎస్పీ | ఆదిలాబాద్ అదనపు ఎస్పీ (అడ్మిన్) |
| పత్తిపాక సాయికిరణ్ | నిర్మల్ ఏఎస్పీ | భైంసా ఏఎస్పీ (ఎస్డీపీఓ) |
| రుత్విక్‌సాయి | వేములవాడ ఏఎస్పీ | ఉట్నూర్ ఏఎస్పీ (ఎస్డీపీఓ) |

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
