Advertisement

KAVITHA SUSPENDED: పార్టీ నుంచి సస్పెండ్

మన పత్రిక, వెబ్​డెస్క్

బీఆరెస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని పేర్కొంది. కవిత గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్ రావుపై అవినీతి ఆరోపణలు చేశారు.

Advertisement

హరీశ్ రావు, సంతోష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని కవిత నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీ లోపల తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో బీఆరెస్ ఆమెపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంది. పార్టీ అనుశాసన నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement