మన పత్రిక, వెబ్‌డెస్క్
BRS ఎమ్మెల్సీ కవిత ( MLC Kavitha ) కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ పార్టీని దీపావళి సందర్భంగా లాంచ్ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ పార్టీ పేరును బీసీ కాన్సెప్ట్ ప్రధానాంశంగా తీసుకుని ‘తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి’ (TBRS) గా పెట్టే అవకాశం ఉందని సమాచారం. బీసీ సమాజం ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని ఈ పార్టీ ప్రారంభం కానుంది. పార్టీ కార్యాలయం కోసం బంజారాహిల్స్‌లో కవిత ఇంటి సమీపంలోని మూడంతస్తుల భవనాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది పార్టీ కార్యకలాపాలకు కేంద్రంగా ఉండనుంది.
అయితే ‘TRS’ పేరు కూడా పరిశీలనలో ఉందని సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఇప్పటికే ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందింది. అందువల్ల ఈ పేరుతో ప్రజల్లోకి వెళ్లడం సులభం అని కవిత సన్నిహితులు భావిస్తున్నారు. ఈ కొత్త పార్టీ ఏర్పాటుతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు సంభవించే అవకాశం ఉంది. బీసీ, మైనారిటీ సమాజాలపై దృష్టి పెట్టి ఓటు బ్యాంకును సొంతం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
