మన పత్రిక, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ప్రస్తుతం ‘బాయ్‌కాట్ లెన్స్‌కార్ట్’ (#BoycottLenskart) హ్యాష్‌ట్యాగ్ తీవ్రంగా ట్రెండ్ అవుతోంది. ప్రముఖ కళ్లద్దాల సంస్థ ‘లెన్స్‌కార్ట్’ తన ఉద్యోగుల డ్రెస్ కోడ్‌కు సంబంధించి రూపొందించిన ఒక అంతర్గత గ్రూమింగ్ డాక్యుమెంట్ ఈ వివాదానికి కారణమైంది. ఈ పత్రంలో మహిళా ఉద్యోగులు హిజాబ్ ధరించవచ్చని, కానీ బొట్టు, సిందూరం, తిలకం, మణికట్టు దారాలు ధరించకూడదని ఉండటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త షెఫాలీ వైద్య ఈ డాక్యుమెంట్‌ను ‘X’ (ట్విట్టర్) వేదికగా షేర్ చేసి, లెన్స్‌కార్ట్ వ్యవస్థాపకులను నిలదీయడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది.
కంపెనీ భారీ లాభాలతో దూసుకుపోతున్న తరుణంలో ఈ నెగెటివ్ క్యాంపెయిన్ మొదలవడంతో లెన్స్‌కార్ట్ ఫౌండర్, సీఈవో పీయూష్ బన్సల్ వెంటనే దిగివచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పత్రం చాలా పాతదని (Outdated), ప్రస్తుత కంపెనీ పాలసీకి దానికి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ఆ డాక్యుమెంట్‌లో బిందీ, తిలకం గురించి ఉన్న నిబంధనలు ముమ్మాటికీ తప్పేనని, అవి కంపెనీ విలువలను సూచించవని అంగీకరించారు. ఆ తప్పులను తాను ముందే గమనించాల్సిందని, ఈ పొరపాటుకు తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. లెన్స్‌కార్ట్‌లో ఎవరి మతపరమైన ఆచారాలపైనా ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- గందరగోళం సృష్టించేందుకు గూండాలను పంపారు: అభిజిత్ దీప్కే
- కేంద్ర ప్రభుత్వానికి సీజేపీ జాతీయ ప్రతినిధి హెచ్చరిక
- షూటింగ్ మొదలవ్వకముందే భారీ రికార్డు సృష్టించిన ధనుష్ కొత్త సినిమా
- అమ్రాబాద్‌లో డిప్యూటేషన్‌పై వెళ్లిన ఉపాధ్యాయులను వెనక్కి పిలవాలని ఎమ్మెల్యే ఆదేశం
- ఢిల్లీలో కాకరోచ్ జనతా పార్టీ నిరసనలు: పది కేసులు నమోదు చేసిన పోలీసులు
