మన పత్రిక, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకల డోన్ వద్ద ఓ బొలెరో వాహనం, లారీని బలంగా ఢీకొట్టడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలతో పాటు ఒక చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
మృతులంతా కర్ణాటక రాష్ట్రానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరంతా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దర్శనానికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
Advertisement
