మన పత్రిక, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్-2026 హాల్ టికెట్లు అధికారికంగా విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్సైట్ cets.apsche.ap.gov.in ద్వారా తమ అడ్మిట్‌కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాల్లో మే 2వ తేదీన ఈ ప్రవేశ పరీక్ష జరగనుంది. మొత్తం 200 మార్కులకు, రెండున్నర గంటల వ్యవధిలో ఆన్లైన్ విధానంలో ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్‌తో పాటు ఆధార్, పాన్ లేదా ఓటర్ ఐడీ వంటి ఏదైనా ఒక ఒరిజినల్ ప్రభుత్వ గుర్తింపు కార్డును అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకురావాలి.
ఏపీ ఐసెట్ 2026 – ముఖ్యమైన తేదీలు
| ఈవెంట్ | తేదీ & సమయం |
| ప్రవేశ పరీక్ష (ఎగ్జామ్) | మే 2, 2026 (ఉదయం 9:00 – 11:30 & మధ్యాహ్నం 2:00 – 4:30) |
| ప్రాథమిక కీ (Primary Key) విడుదల | మే 5, సాయంత్రం 5 గంటలకు |
| కీ పై అభ్యంతరాల స్వీకరణ | మే 7 వరకు |
| తుది ఫలితాల ప్రకటన | మే 16, 2026 |
ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి ఏపీ ఐసెట్ – 2026 హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- వైఎస్ షర్మిల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి నారా లోకేశ్
- కూటమి రెండేళ్ల పాలనపై రేపటి నుంచి టీడీపీ ఇంటింటి ప్రచారం
- హాస్పిటల్ బెడ్‌పై వైఎస్ షర్మిల సర్జరీ జరిగినట్లు వెల్లడించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్
- తెలంగాణలో రెండవ త్రైమాసికంలో తగ్గిన ద్వేషపూరిత నేరాలు
- హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో బాలకృష్ణను పరామర్శించిన సీఎం చంద్రబాబు
