TS Telangana Inter 1st 2nd Year Result 2026 tgbie.cgg.gov.in: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు నేడు (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. పరీక్షలు ముగిసిన కేవలం 25 రోజుల్లోనే రికార్డు వేగంతో బోర్డు రిజల్ట్స్ సిద్ధం చేయడం విశేషం.
ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,97,075 మంది విద్యార్థులు (ఫస్ట్ ఇయర్: 4,89,126, సెకండ్ ఇయర్: 5,07,949) హాజరయ్యారు. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్థులు అధికారిక వెబ్సైట్ల ద్వారా తమ మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సౌకర్యం లేనివారి కోసం IVRS సర్వీస్, SMS ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునే సదుపాయాన్ని బోర్డు కల్పించింది.
📱 ఫలితాలు చెక్ చేసుకునే విధానం (సింపుల్ స్టెప్స్):
- ముందుగా మీ మొబైల్ లేదా కంప్యూటర్లో tgbie.cgg.gov.in లేదా results.cgg.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
- హోమ్‌పేజీలో కనిపించే TS Inter Results 2026 (1st Year లేదా 2nd Year) లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను తప్పులు లేకుండా ఎంటర్ చేసి Submit నొక్కండి.
- వెంటనే మీ మార్కులు, గ్రేడ్ స్క్రీన్ పై కనిపిస్తాయి. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
