Advertisement

మైనర్‌గా తేలిన మోనాలిసా.. భర్త ఫర్హాన్‌పై పోక్సో కేసు

మన పత్రిక, మహేశ్వర్: గత ఏడాది కుంభమేళా ఫోటోలతో ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన భాగ్యశ్రీ అలియాస్ మోనాలిసా ప్రేమపెళ్లి వ్యవహారంలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. కేరళకు చెందిన ఫర్హాన్ ఖాన్‌ను ఆమె ఇటీవల వివాహం చేసుకోగా, కుటుంబ సభ్యులు లవ్ జిహాద్ ఆరోపణలతో జాతీయ ఎస్టీ (NCST) కమిషన్‌ను ఆశ్రయించారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా అధికారులు వయస్సు నిర్ధారణ విచారణ చేపట్టగా, పెళ్లి నాటికి మోనాలిసా వయసు కేవలం 16 ఏళ్ల రెండు నెలలు మాత్రమేనని అధికారికంగా తేలింది. మైనర్‌ను వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరం కావడంతో, మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో ఫర్హాన్ ఖాన్‌పై పోలీసులు వెంటనే పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.

Advertisement

సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయంతో, సినిమా అవకాశాల ఆకర్షణలో పడి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement