ఇన్ఫోసిస్ సంస్థ దేశవ్యాప్తంగా ఫ్రెషర్స్ కోసం భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. Specialist Programmer Trainee రోల్ కి మరియు Digital Specialist Engineer Trainee పోస్టులకు 2024, 2025 బ్యాచ్ కు చెందిన BE, BTech, ME, MTech, MCA, MSc గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా CSE, IT, AI/ML, Data Science, Cybersecurity, ECE, EEE వంటి బ్రాంచ్‌లకు చెందిన వారికి ఇది మంచి అవకాశం.
ఈ రిక్రూట్మెంట్ లో ఎంపికైన వారికి ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందిస్తున్నారు. Specialist Programmer L3కు ₹21 LPA, L2కు ₹16 LPA, L1కు ₹10 LPA తో పాటు ₹1 లక్ష జాయినింగ్ బోనస్ ఇవ్వనున్నారు. అలాగే Digital Specialist Engineer పోస్టుకు ₹6.25 LPAతో పాటు ₹75,000 బోనస్ అందిస్తారు. ప్రోగ్రామింగ్, టెక్నాలజీపై ఆసక్తి ఉన్న ఫ్రెషర్స్‌కు ఇది కెరీర్ స్టార్ట్ చేయడానికి మంచి ఛాన్స్‌గా భావిస్తున్నారు.
సెలెక్షన్ ప్రాసెస్ లో ముందుగా ఆన్‌లైన్ అసెస్‌మెంట్ నిర్వహించి, తర్వాత ఇన్-పర్సన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ప్రోగ్రామింగ్ స్కిల్స్‌పై ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. గత 6 నెలల్లో ఇన్ఫోసిస్ సెలెక్షన్ ప్రాసెస్‌లో పాల్గొన్న వారు (Systems Engineer తప్ప) అప్లై చేయలేరు. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న అభ్యర్థులు కూడా అర్హులు కారు. ఇక ఈ అవకాశానికి అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 13, 2026. కింది లింక్ ని ఉపయోగించి జాబ్స్ అప్లై చేసుకోండి.
Apply Link: https://tinyurl.com/yuhxb9e6
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- ఆగస్టు 5 రాశిఫలాలు: గ్రహాల సంచారంతో ఆ రాశుల వారికి ధనలాభాలు
- లాభాల్లో అంతర్జాతీయ మార్కెట్లు: భారీ గ్యాప్ అప్‌తో ప్రారంభమయ్యే అవకాశం
- నటి త్రిషపై వ్యాఖ్యల వివాదం: చెన్నైలో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
- ఏఐ తెచ్చిన తిప్పలు: కాపీరైటర్ వేతనం రూ.2 లక్షల నుంచి రూ.40 వేలకు
- రేవతి నక్షత్ర ప్రభావంతో నేటి రాశి ఫలితాలు ఇవే
