మన పత్రిక: ఒకప్పటి ప్రముఖ నటి దేవయాని కుమార్తె ప్రియాంక సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేయనున్నారు. తెలుగులో హిట్టయిన ‘కోర్ట్’ డ్రామా మూవీ రీమేక్ ద్వారా ఆమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. త్యాగరాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో స్టార్ హీరో ప్రశాంత్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. మాతృకలో కొత్త నటి శ్రీదేవి పోషించిన పాత్రలో ప్రియాంక డెబ్యూ చేయనుండగా, చెన్నైలో ఈ సినిమాకు ఇటీవల కొబ్బరికాయ కొట్టారు.
1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ కాదల్ కోటై (తెలుగులో ప్రేమలేఖ) సినిమాలో అజిత్ సరసన నటించిన దేవయాని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తమిళ దర్శకుడు రాజకుమారన్‌ను పెద్దల అంగీకారం లేకుండానే పెళ్లి చేసుకున్న ఆమె క్రమేపీ సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం చిన్న పాత్రలు, టీవీ సీరియల్స్ చేస్తున్న దేవయాని, తన ఇద్దరు పిల్లల్లో ఒకరైన ప్రియాంకను ఇప్పుడు హీరోయిన్‌గా పరిచయం చేస్తుండటం విశేషం.
ఇవి కూడా చదవండి :
- కోహెడలో రూ.2,300 కోట్లతో పండ్ల మార్కెట్కు సీఎం శంకుస్థాపన
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
