మన పత్రిక, హైదరాబాద్: ప్రజా సమస్యలు బయటకు రాకుండా ఉండేందుకే బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, సమస్యలపై తమ ధర్మ యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏఐసీసీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని, ఇక్కడ దోచుకున్న సొమ్మును ఇతర రాష్ట్రాల ఎన్నికలకు తరలిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నాదర్గుల్లోని సర్వే నంబర్ 613/119లో ఉన్న 374 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఫేక్ డాక్యుమెంట్లతో ఆక్రమిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ, అక్కడ ఫెన్సింగ్ వేస్తుంటే కలెక్టర్, ఆర్డీఓ ఏం చేస్తున్నారని నిలదీశారు. కొత్వాల్‌గూడ, మానస హిల్స్, వట్టినాగులపల్లిలో కూడా వేలాది ఎకరాలు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద 50 ఎకరాలు వదిలిపెట్టి, మిగతా 325 ఎకరాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్పందించకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- శంషాబాద్‌లో ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం
- అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు కేసులో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
- ఎల్‌నినో ప్రభావం నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు పక్కా ప్రణాళికలు
- జులై 22 రాశి ఫలాలు: బ్యాంకింగ్ ఉద్యోగులకు ప్రమోషన్లు
- తిరుమల భక్తులకు ముఖ్య గమనిక, సర్వదర్శనం టోకెన్లపై టీటీడీ కీలక నిర్ణయం
