మన పత్రిక, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తుది తీర్పును ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది. బుధవారం నాడు ఈ తీర్పు వెలువడాల్సి ఉండగా, అనుకోకుండా ధర్మాసనం దీనిని వాయిదా వేసింది.
ప్రాజెక్టు వైఫల్యానికి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పలువురు అధికారులే బాధ్యులని కమిషన్ నివేదిక పేర్కొంది. దీనిని సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్‌రావు, ఐఏఎస్ స్మితా సభర్వాల్, మాజీ సీఎస్ జోషి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించారని, సాక్షులతో క్రాస్ ఎగ్జామినేషన్ జరగలేదని కేసీఆర్ తరఫు న్యాయవాది వాదించారు.
మరోవైపు, ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ కమిషన్‌ను వేశామని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. మార్చి 12న ఇరుపక్షాల వాదనలు ముగియగా అప్పట్లో న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తదుపరి వెలువడే కోర్టు తీర్పు ఆధారంగానే ప్రభుత్వ చర్యలు ఉండనున్నాయి.
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
