మన పత్రిక: యుద్ధ ప్రభావంతో బంగారం ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గురువారం నాటికి 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,48,970 వద్ద ట్రేడ్ కాగా, 22 క్యారెట్ బంగారం రూ.1,36,550, 18 క్యారెట్ బంగారం రూ.1,11,730 వద్ద నమోదైంది. అయితే శుక్రవారం ఉదయం ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. 24 క్యారెట్ బంగారం రూ.1,48,960కు, 22 క్యారెట్ రూ.1,36,540కు, 18 క్యారెట్ బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గింది.
యుద్ధం ప్రారంభానికి ముందు బంగారం ధరలు రూ.1.90 లక్షల వద్ద ఉండగా, ప్రస్తుతం గణనీయంగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిర పరిస్థితులు, అలాగే అమెరికా డాలర్ బలపడటం కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ వివరాల ప్రకారం, బంగారం ధరలు రోజువారీగా స్వల్ప మార్పులతో తగ్గుతూ వస్తున్నాయి. పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ఈ మార్పులను గమనిస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
