Advertisement

Karimnagar: సెప్టెంబర్ 3న కరీంనగర్ లో ఉద్యోగ మేళా

మన పత్రిక, వెబ్​డెస్క్

Advertisement

Job mela Karimnagar on 3 September

కరీంనగర్ జిల్లా ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3, 2025న ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో జరుగుతుంది.

Advertisement

ఈ మేళాలో 120 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు ఫార్మసిస్ట్ (40), కస్టమర్ సేల్స్ అసిస్టెంట్ (20), స్టాక్ పికింగ్ & ప్యాకింగ్ అసిస్టెంట్ (30), ఆడిట్ అసిస్టెంట్ (30) పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. అభ్యర్థులు పదోతరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి. ఫార్మసిస్ట్ పోస్టులకు D.Pharm లేదా B.Pharm అర్హత తప్పనిసరి.

వయస్సు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రయోజనాల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లో పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, బయోడేటా, రెండు రిసెంట్ ఫోటోలతో మేళాకు హాజరుకావాలి.

Advertisement

మరింత సమాచారం కోసం 9392013323, 8895337496, 7207659998 నంబర్లలో సంప్రదించవచ్చు.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement