మన పత్రిక వెబ్‌డెస్క్: ఇవాళ ఆదివారం (మార్చి 8) కావడంతో నాన్ వెజ్ ప్రియులకు కోళ్ల వ్యాపారులు భారీ షాక్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు మళ్లీ మండిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత కాస్త తగ్గుముఖం పట్టిన ధరలు, ఇప్పుడు మళ్లీ కిలో రూ.300 మార్కును తాకాయి. ధరలు పెరిగినా సండే హాలీడే కావడంతో చికెన్ షాపులన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు, దానికి భిన్నంగా గుడ్ల ధరలు మాత్రం భారీగా పడిపోవడం సామాన్యులకు కాస్త ఊరటనిస్తోంది.
మండిపోతున్న చికెన్.. ఎక్కడ ఎంతంటే? తెలుగు రాష్ట్రాల్లో ఎండాకాలం మొదలవ్వడం, ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీనికి తోడు బర్డ్ ఫ్లూ ప్రభావంతో ఉత్పత్తి తగ్గిపోయి.. డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు.
- హైదరాబాద్: స్కిన్‌లెస్ కిలో రూ.290 నుంచి రూ.300 పలుకుతోంది. డ్రెస్డ్ చికెన్ రూ.260, రిటైల్ లైవ్ బర్డ్ రూ.177, ఫామ్ లైవ్ బర్డ్ రూ.150 గా ఉంది.
- ఆసిఫాబాద్, విజయవాడ: కేజీ స్కిన్‌లెస్ చికెన్ ఏకంగా రూ.300 కి చేరుకుంది.
- వరంగల్, కామారెడ్డి: ఇక్కడ కిలో స్కిన్‌లెస్ రూ.280 నుంచి రూ.290 వరకు అమ్ముతున్నారు.
భారీగా తగ్గిన గుడ్ల ధరలు.. కారణం ఇదే! సాధారణంగా చికెన్ రేట్లు పెరిగితే గుడ్ల రేట్లు కూడా పెరుగుతాయి. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయింది.
- కారణం: గల్ఫ్‌లో ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో.. భారత్ నుంచి విదేశాలకు వెళ్లాల్సిన గుడ్ల ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో దేశీయంగా నిల్వలు భారీగా పెరిగిపోయి ధరలు పతనమయ్యాయి.
- ప్రస్తుత ధరలు: మొన్నటి వరకు రూ.5 నుంచి రూ.6 పలికిన ఒక్కో గుడ్డు ధర.. ఇప్పుడు రూ.4 కే దొరుకుతోంది. 30 గుడ్ల ట్రే రూ.130 – 140 మధ్య, 12 గుడ్ల ప్యాక్ రూ.60 కి లభిస్తోంది.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
