మన పత్రిక వెబ్డెస్క్, రాజన్న సిరిసిల్ల: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, దాడుల సెగ తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరింది. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో జిల్లాలోని పోతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎన్. రాజేశ్వరరావుకు గాయాలయ్యాయి.
గత ఏడాదిగా అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్న రాజేశ్వరరావు.. ఈ దాడుల్లో తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నాడు. వీడియో కాల్ ద్వారా తమతో మాట్లాడినప్పటికీ, గాయాలను మాత్రం చూపించలేదని ఆయన తండ్రి ప్రభాకర్ రావు కన్నీటిపర్యంతమయ్యారు. తన కుమారుడిని ఎలాగైనా సురక్షితంగా స్వగ్రామానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం, అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.
సురక్షితంగా చేరిన యాత్రికులు: మరోవైపు, గల్ఫ్ లోని యుద్ధ వాతావరణం నేపథ్యంలో సౌదీ అరేబియా (జెద్దా) నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులు సురక్షితంగా ఉన్నామని తెలిపారు. విమానాల రద్దు కారణంగా ప్రయాణం కాస్త ఆలస్యమైనప్పటికీ, ట్రావెల్ ఏజెన్సీలు తమకు అన్ని వసతులు కల్పించాయని, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని మదీనా యాత్రికుడు మహ్మద్ అబ్దుల్ రజాక్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
- పొరుగు దేశాలకు ఇరాన్ క్షమాపణలు.. కానీ ఆ విషయంలో తగ్గేదే లేదన్న అధ్యక్షుడు!
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సేవలు బంద్.. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఎమిరేట్స్ కీలక నిర్ణయం!
- ఎస్సెస్సీ జేఈ టైర్-1 స్కోర్ కార్డ్.. మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి!
- హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. లోన్ల ఈఎంఐల తగ్గింపు, ఎఫ్డీలపై వడ్డీ పెంపు!
- తెలంగాణ గద్దర్ చలనచిత్ర అవార్డులు 2025 ప్రకటన.. | Gaddar Film Awards 2025 Announced
