మన పత్రిక వెబ్‌డెస్క్, న్యూఢిల్లీ: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూనియర్ ఇంజనీర్ (JE) టైర్-1 పరీక్షకు సంబంధించిన స్కోర్ కార్డులు త్వరలోనే అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. మార్చి 6న టైర్-1 ఫలితాలను ప్రకటించిన కమిషన్.. మార్చి నెలలోనే అభ్యర్థుల మార్కుల వివరాలతో కూడిన స్కోర్ కార్డును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో మొత్తం 1,731 ఖాళీల భర్తీకి గతేడాది డిసెంబర్ 3 నుంచి 6 వరకు టైర్-1 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాల్లో అర్హత సాధించిన వారితో పాటు, క్వాలిఫై కాని అభ్యర్థులు కూడా తమ సెక్షన్-వారీ మార్కులను ఈ స్కోర్ కార్డ్ ద్వారా తెలుసుకోవచ్చు. కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ సాధించిన వారు తదుపరి దశ టైర్-2 పరీక్షకు అర్హత సాధిస్తారు.
స్కోర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
- ముందుగా ssc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- హోమ్‌పేజీలో లాగిన్ సెక్షన్‌పై క్లిక్ చేసి, మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ నమోదు చేయండి.
- లాగిన్ అయిన తర్వాత ‘SSC JE Tier 1 Score Card 2026’ లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ మార్కుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. భవిష్యత్ అవసరాల కోసం ఆ పీడీఎఫ్‌ను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి.
స్కోర్ కార్డ్ లింక్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి, విడుదలైన వెంటనే చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. టైర్-1లో ఎంపికైన వారు ఏమాత్రం సమయం వృథా చేయకుండా టైర్-2 పరీక్షకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
