మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: పశ్చిమాసియా (గల్ఫ్) దేశాల్లో జరుగుతున్న యుద్ధం సెగ మన సామాన్యుడి వంటింటికి చేరింది. అక్కడ రవాణా నిలిచిపోవడంతో.. మన దేశ ఆర్థిక వ్యవస్థపై, నిత్యావసరాల ధరలపై తీవ్ర ప్రభావం పడబోతోంది.
గల్ఫ్ దేశాలకు ఎగుమతి కావాల్సిన కోడిగుడ్లు, అరటిపండ్లు, ఉల్లి, కూరగాయల షిప్‌లు నిలిచిపోవడంతో.. స్థానికంగా సరఫరా పెరిగి తాత్కాలికంగా వాటి ధరలు పడిపోనున్నాయి. ఉదాహరణకు ₹7 ఉన్న గుడ్డు రేటు ₹5 కి రానుంది. అయితే ఇది నాణేనికి ఒకవైపే!
మరోవైపు ఈ యుద్ధం సామాన్యుడికి భారీ వాత పెట్టబోతోంది. ముడిచమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగడంతో వంట గ్యాస్ డెలివరీల్లో జాప్యం జరగనుంది. అలాగే వ్యవసాయానికి కీలకమైన యూరియా కొరత ఏర్పడితే పంట దిగుబడి తగ్గి.. భవిష్యత్తులో నిత్యావసరాల ధరలు భగ్గుమంటాయి. ముడిసరుకుల కొరతతో రియల్ ఎస్టేట్ రంగంలోనూ కొత్త ఇళ్ల హ్యాండోవర్స్ కు బ్రేకులు పడే అవకాశం ఉంది. మొత్తంగా ఈ ‘ప్రైస్ బాంబ్’ సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- HYDRAA Jobs: సరూర్నగర్ స్టేడియం వద్ద భారీగా నిరుద్యోగులు.. తోపులాట
- Telangana Rain Forecast: తెలంగాణలో మళ్లీ వానలు.. పలు జిల్లాలకు వర్ష సూచన
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ మంచి వసూళ్లు
- జాన్వీ కపూర్, శ్రీలీల కాంబినేషన్లో హిందీ రొమాంటిక్ థ్రిల్లర్
- సన్ నెక్స్ట్లోకి లోకేష్ కనగరాజ్ ‘డిసి’ డిజిటల్ హక్కులు
