Telangana Rain Forecast | తెలంగాణలో పలు జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. దక్షిణ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉండొచ్చని, సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే శుక్రవారం సాయంత్రం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.
శ్రీశైలంకు భారీగా వరద ప్రవాహం
ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో అధికారులు 32 గేట్లను ఎత్తారు. దీంతో శ్రీశైలంలోకి ప్రస్తుతం 2,32,308 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 66 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- HYDRAA Jobs: సరూర్నగర్ స్టేడియం వద్ద భారీగా నిరుద్యోగులు.. తోపులాట
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ మంచి వసూళ్లు
- జాన్వీ కపూర్, శ్రీలీల కాంబినేషన్లో హిందీ రొమాంటిక్ థ్రిల్లర్
- సన్ నెక్స్ట్లోకి లోకేష్ కనగరాజ్ ‘డిసి’ డిజిటల్ హక్కులు
- రష్యా చమురు కొనుగోలు దేశాలపై ఆంక్షల బిల్లును ఆమోదించిన అమెరికా సెనేట్
