మన పత్రిక వెబ్‌డెస్క్, వాషింగ్టన్: ఇరాన్‌తో ఇకపై ఎలాంటి ఒప్పందాలు ఉండవని, ఆ దేశం బేషరతుగా లొంగిపోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఆయన ఓ కీలక పోస్టు పెట్టారు.
ఇరాన్ లొంగిపోయిన తర్వాతే అక్కడ అందరికీ ఆమోదయోగ్యమైన కొత్త నాయకుడి ఎన్నిక ఉంటుందని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. మిత్రదేశాలతో కలిసి ఇరాన్‌ను ప్రస్తుత సంక్షోభం నుంచి బయటకు తీసుకొస్తామని, గతం కంటే ఆర్థికంగా మరింత బలమైన దేశంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ పోస్టులో తెలిపారు.
అగ్రరాజ్య అధ్యక్షుడి హోదాలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు.. ఇరాన్ లో నేరుగా ‘రెజీమ్ చేంజ్’ (ప్రభుత్వ మార్పు) కు అమెరికా పక్కా స్కెచ్ వేసిందన్న సంకేతాలను ఇస్తున్నాయి. ఈ నిర్ణయం భవిష్యత్తులో ప్రపంచ చమురు మార్కెట్లపై, భౌగోళిక రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
దీనిపై ఇరాన్ అగ్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠగా మారింది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
