మన పత్రిక వెబ్డెస్క్, సూర్యాపేట: సూర్యాపేట పట్టణ ప్రధాన రహదారిపై ఇష్టారాజ్యంగా వెలసిన ఆక్రమణలను పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సంయుక్తంగా తొలగించారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు అధికారులు ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై సాయిరాం మాట్లాడుతూ.. వ్యాపారులు రోడ్లను ఆక్రమించి దుకాణాలు నిర్వహించవద్దని హెచ్చరించారు. మున్సిపల్ సిబ్బంది సహకారంతో రోడ్లపైకి వచ్చిన షాపుల సామగ్రిని, మట్టి కుప్పలను క్లియర్ చేశారు. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ ఆక్రమణల తొలగింపుతో మెయిన్ రోడ్డుపై రాకపోకలు సాగించే వేలాది మంది వాహనదారులకు, పాదచారులకు ట్రాఫిక్ కష్టాలు భారీగా తప్పనున్నాయి. ప్రజలు, వ్యాపారులు తమ వస్తువులను రోడ్ల మీదికి తెచ్చి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
భవిష్యత్తులోనూ ట్రాఫిక్ నియంత్రణకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
